రెండవ విడత గ్రామపంచాయితీ ఎన్నికలు మునగాల మండలంలో మానవీయత చాటిన పోలీసులు
సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్, డిసెంబర్ 14 సూర్యాపేట జిల్లాలో ఆదివారం జరుగుతున్న రెండవ విడత గ్రామపంచాయితీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మునగాల మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు చూపిన మానవీయత ప్రజల ప్రశంసలు అందుకుంటోంది. వృద్ధురాలికి వీల్‌చైర్ సహాయం పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓ వృద్ధురాలు నడవలేని పరిస్థితిలో ఉండటాన్ని గమనించిన సి.సి.ఎస్ కానిస్టేబుల్ సతీష్ మరియు స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ యాకయ్య వెంటనే స్పందించారు. వృద్ధురాలిని వీల్‌చైర్‌లో పోలింగ్ కేంద్రం లోపలికి తీసుకెళ్లి, ఆమె ఓటు హక్కును వినియోగించుకునేలా పూర్తి సహకారం అందించారు. ప్రజాస్వామ్య విలువలకు అద్దం పట్టిన చర్య ఎన్నికల విధుల్లో భాగంగా కేవలం...