కౌంటింగ్‌ను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్, డిసెంబర్ 11 గ్రామపంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఎక్కడా తప్పులు, నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు ఆదేశించారు. గురువారం ఆమె కనగల్ మండలంలోని జి. ఎడవెల్లి, ఇస్లాం నగర్ గ్రామాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఎన్నికల నిర్వహణపై సమీక్షించారు. పోలింగ్ తర్వాత అసలైన బాధ్యత కౌంటింగ్ దశలోనే కలెక్టర్ మాట్లాడుతూ, పోలింగ్ విజయవంతంగా ముగిసిన తర్వాత అసలు బాధ్యత కౌంటింగ్ దశలో ప్రారంభమవుతుందన్నారు. కౌంటింగ్‌లో జరిగే ప్రతి చర్య ఎన్నికల పారదర్శకతను ప్రతిబింబిస్తుందని, అందువల్ల ఒక్క చిన్న నిర్లక్ష్యాన్ని కూడా సహించరాదని స్పష్టం చేశారు. ఒక అభ్యర్థికి ఒకే ఏజెంట్ అనుమతి...