కౌంటింగ్‌కు పటిష్ట బందోబస్తు – కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశాలు
సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్, డిసెంబర్ 11 జిల్లాలో జరుగనున్న ఓట్ల లెక్కింపును శాంతియుతంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ ఏర్పాట్ల పరిశీలన మద్దిరాల, నూతనకల్ మండల కేంద్రాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. పోలింగ్ నిర్వహణ, కౌంటింగ్ ప్రక్రియలో అవసరమైన ఏర్పాట్లపై సిబ్బంది నుండి వివరాలు తెలుసుకున్నారు. టోకెన్ విధానంలో ఓటు హక్కు వినియోగం మధ్యాహ్నం 1:00 గంటల లోపు పోలింగ్ కేంద్రాల ఆవరణలోనున్న ప్రతీ ఓటరికి టోకెన్లు జారీ చేసి, ఎవరూ తిరిగి...