మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

నల్లగొండ బ్యూరో,డిసెంబర్ 10,డైనమిక్ న్యూస్ మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ఉదయం గట్టుప్పల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన డీఆర్సీ (DRC) కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎన్నికల సామాగ్రి పంపిణీలో అప్రమత్తత అవసరం ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా ఎన్నికల సామాగ్రి పంపిణీ చేయాలని అధికారులకు, సిబ్బందికి కలెక్టర్ ఆదేశించారు. స్టాట్యూటరీ, నాన్-స్టాట్యూటరీ పత్రాలు, ఓటరు కంపార్ట్మెంట్ మెటీరియల్, ఇండెలిబుల్ ఇంకు బాటిళ్లు తదితర సామాగ్రి వివరంగా పరిశీలించారు. పీఓ డైరీ సక్రమంగా నిర్వహించాలి పోలింగ్ అధికారులు (పీ.ఓలు) తమ డైరీలను జాగ్రత్తగా, క్రమబద్ధంగా నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. చిన్న తప్పులే పెద్ద సమస్యలకు...