చేనేత కార్మికులను ఆదుకోవాలికూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయాలని వినతిపత్రం

డైనమిక్ న్యూస్, సోమందేపల్లి , డిసెంబర్ 8 చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం సోమందేపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో డిప్యూటీ తహసిల్దార్ రెడ్డి శేఖర్‌కు వినతిపత్రం అందజేశారు. 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు అమలు చేయాలి ఈ సందర్భంగా చేనేత కార్మిక సంఘం మండల కార్యదర్శి జింక నాగరాజ్, సీపీఎం పార్టీ మండల కమిటీ సభ్యులు కొండా వెంకటేశులు మాట్లాడుతూ— ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, అలాగే ‘నేతన్న నేస్తం’ పథకం కింద సంవత్సరానికి రూ.25,000 ఆర్థిక సాయం అందిస్తామని హామీ...