హోంగార్డ్ ఆఫీసర్స్ సంక్షేమానికి జిల్లా పోలీసు శాఖ పూర్తి మద్దతు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ స్పష్టం

నల్గొండ బ్యూరో, డైనమిక్ న్యూస్,డిసెంబర్ 8 జిల్లా పోలీసు శాఖలో ముఖ్యమైన విభాగంగా పని చేస్తున్న హోంగార్డ్ సిబ్బంది సంక్షేమానికి పోలీసు శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. హోంగార్డ్ సిబ్బంది సమస్యలపై ఎస్పీ దర్బార్ జిల్లా పోలీస్ కార్యాలయంలో హోంగార్డ్ సిబ్బందికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దర్బార్‌లో ఎస్పీ పాల్గొని, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. విధుల నిర్వహణలో ఉన్న ఇబ్బందులు, వేతనాలు, అలవెన్సులు, ఆరోగ్య సమస్యలపై సిబ్బంది అభిప్రాయాలను తీసుకున్నారు. పోలీసులతో సమానంగా సేవలు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, జిల్లా పోలీస్ శాఖలో అంతర్భాగమైన హోంగార్డ్ సిబ్బంది పోలీసులతో సమానంగా శాంతి...