దేశంలోనే ఉత్తమ విద్యావ్యవస్థ ఆంధ్రప్రదేశ్‌లో రూపుదిద్దుకుంటోంది: జీవీ ఆంజనేయులు
వినుకొండ , డైనమిక్ న్యూస్, డీసెంబర్ 5 దేశంలోనే ఉత్తమ విద్యావ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతున్నది అని వినుకొండ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు శుక్రవారం వెల్లడించారు. కూటమి ప్రభుత్వ 18 నెలల పాలనలో, విద్యా మంత్రి లోకేష్ శ్రద్ధ, సంస్కరణలతో ప్రభుత్వ బడుల పరిస్థితి మారుతోందని ఆయన చెప్పారు. జగన్ పాలనలో అధోగతిపాలైన ప్రభుత్వ విద్యకు కొత్త జీవం జీవీ ఆంజనేయులు చెప్పారు, "జీవో 117 వంటి అరాచక నిర్ణయాలతో వైకాపా పాలనలో పాడైన ప్రభుత్వ విద్యకు ఇప్పుడు కొత్తజీవం పోసబడుతోంది. ఈ మార్పులను పేరెంట్స్ - టీచర్స్ సమావేశాల ద్వారా విద్యార్థుల తల్లిదండ్రుల ముందుకు తీసుకురావడం సంతోషకరం." పేరెంట్స్ -...