దళిత విద్యార్థులపై జాతివివక్ష ఘటనలకు కఠిన చర్యలు తీసుకోవాలి పిఠాపురం ఘటనతో ప్రభుత్వానికి చెంపదెబ్బ: కొమ్ము చంద్రశేఖర్
కారంపూడి, డిసెంబర్ 03, డైనమిక్ న్యూస్ పిఠాపురం నియోజకవర్గం యు-కొత్తపల్లి మండలం యండపల్లి హైస్కూల్‌లో చదువుతున్న దళిత విద్యార్థులపై జరుగుతున్న జాతివివక్ష, అవమానకర చర్యలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయని పల్నాడు జిల్లా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొమ్ము చంద్రశేఖర్ అన్నారు. 78 ఏళ్ల స్వాతంత్ర్యం… ఇంకా కుల దౌర్జన్యాలేనా? స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు నిండినా ఇంకా విద్యాలయాల్లో కులవివక్ష కొనసాగుతుండడం సిగ్గుచేటని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే వివక్షకు పాల్పడడం సమాజానికి ప్రమాదకర సంకేతమని ఆయన వ్యాఖ్యానించారు. విద్యార్థుల మానసిక వేదన స్పష్టమే చిన్న వయసులోనే విద్యార్థులు మీడియా ముందుకు వచ్చి తమ గోడును వెళ్లగక్కాల్సిన పరిస్థితి...