కల్లూరు గ్రామం నుంచి కాంగ్రెస్‌లో భారీ చేరికలు బీఆర్‌ఎస్ పార్టీని వీడిన 50 కుటుంబాలు

నేరేడుచర్ల, డైనమిక్ న్యూస్,డిసెంబర్ 3 రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై నేరేడుచర్ల మండలం కల్లూరు గ్రామానికి చెందిన 50 కుటుంబాలు బీఆర్‌ఎస్ పార్టీని విడిచి కాంగ్రెస్ పార్టీలో చేరాయి. మండల కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా చేరిక కార్యక్రమం కల్లూరు గ్రామానికి చెందిన మాజీ సింగిల్ విండో ఛైర్మన్ అనంత శ్రీనివాస్ గౌడ, కొంజేటి కరుణాకర్ ఆధ్వర్యంలో నేరేడుచర్ల మండల కాంగ్రెస్ కార్యాలయంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొణతం చిన్న వెంకటరెడ్డి కొత్తగా చేరిన కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి...