లంచం అడగడమూ, తీసుకోవడమూ నేరమే— జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

నల్గొండ బ్యూరో, డిసెంబర్ 3 , డైనమిక్ న్యూస్ ప్రభుత్వ కార్యాలయాల్లో లంచానికి తావులేకుండా పారదర్శక పరిపాలన ఉండాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. లంచం అడగడం, తీసుకోవడం చట్టరీత్యా నేరమని, దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏసీబీ వారోత్సవాల ప్రారంభం ఈ నెల 3 నుంచి 9వరకు నిర్వహించనున్న తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వారోత్సవాలలో భాగంగా, బుధవారం తన చాంబర్లో లంచం నేరమని తెలియజేస్తున్న గోడ పత్రికను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. లంచం అడిగితే వెంటనే ఫిర్యాదు చేయాలి ఎవరైనా ప్రభుత్వ అధికారి గానీ, ఉద్యోగి గానీ లంచం కోరితే వెంటనే 1064 టోల్ ఫ్రీ నెంబర్ కు...