నామినేషన్ కేంద్రం పరిశీలించిన సూర్యాపేట జిల్లా ఎస్పీ నర్సింహా

నేరేడుచర్ల, డిసెంబర్ 3, డైనమిక్ న్యూస్ మూడవ విడత ఎన్నికల నామినేషన్లు జరుగుతున్న నేరేడుచర్ల మండలం దిర్షినిచర్ల గ్రామంలోని నామినేషన్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ నర్సింహా, కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, సీఐ చరమంద రాజు నేరేడు చర్ల  ఎస్ ఐ రవీందర్,తహసిల్దార్ సురిగీ సైదులు తో కలిసి పరిశీలించారు. 100 మీటర్ల పరిధిలో ఆంక్షలు తప్పనిసరి నామినేషన్ కేంద్రం చుట్టూ 100 మీటర్ల పరిధిలో నిర్బంధాలు పటిష్టంగా అమలు చేయాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు. అనుమతిలేని వ్యక్తులు కేంద్రంలోకి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎన్నికల నియమావళి అమలుపై ప్రత్యేక దృష్టి ఎన్నికల అధికారి సూచించిన నియమ నిబంధనలు శాతం శాతం అమలు...