గ్రామ ప్రగతే నా శ్వాస… ప్రజాసేవకే నా బాట సర్పంచ్ అభ్యర్థిగా ఉపాధ్యాయుడు కొత్తపల్లి ప్రభాకర్ ముందుకు

మఠంపల్లి, డిసెంబర్ 3– డైనమిక్ న్యూస్ సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం హనుమంతులగూడెం గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కొత్తపల్లి ప్రభాకర్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచ్ అభ్యర్థిగా ప్రజల ముందుకు వచ్చారు. గ్రామాభివృద్ధే లక్ష్యంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టినట్లు ఆయన ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా నెలనెలా వచ్చే ప్రభుత్వ జీతం, భద్రమైన ఉద్యోగాన్ని వదిలి ప్రజాసేవ బాట పట్టడం వెనుక తన గ్రామంపై ఉన్న అపారమైన ప్రేమే కారణమని ప్రభాకర్ వివరించారు. ఉపాధ్యాయుడిగా కొంతమంది విద్యార్థుల భవిష్యత్తును మాత్రమే తీర్చిదిద్దగలిగే అవకాశం ఉన్నప్పటికీ, ప్రజాప్రతినిధిగా గ్రామం మొత్తాన్ని అభివృద్ధి బాటలో నడిపించవచ్చన్న నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గ్రామ సమస్యలే...