స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించాలి : పవన్ కుమార్ యాదవ్
డైనమిక్ న్యూస్, నేరేడు చర్ల, డిసెంబర్ 1 బీజేపీకే ఓటు అడిగే నైతిక హక్కు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు సత్తా చాటాలని భారతీయ జనతా పార్టీ మాజీ మండల అధ్యక్షులు గొడ్డేటి పవన్ కుమార్ యాదవ్ అన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు బీజేపీకే ఉందన్నారు. గ్రామాలకు కేంద్రం నుంచి నిధులు గ్రామ పంచాయతీలకు అధికంగా నిధులు కేటాయిస్తున్నది కేంద్ర ప్రభుత్వం మాత్రమేనని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం ద్వారా గ్రామీణ రోడ్లు, మరుగుదొడ్ల నిర్మాణానికి భారీ నిధులు వెచ్చిస్తోందని అన్నారు. బీజేపీ గెలిస్తే అభివృద్ధి పథకాలు సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే కేంద్రం...