ఆపరేషన్ ‘కగార్’ నిలిపివేయాలి – బూటకపు ఎన్‌కౌంటర్లకు స్వస్తి పలకాలి : సీపీఎం నాయకులునల్లగొండలో లయన్స్ క్లబ్‌లో ప్రజా నిరసన సభ – పలు ప్రజాసంఘాల నేతల హాజరు

నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్, నవంబర్ 30 నల్లగొండ పట్టణంలోని లయన్స్ క్లబ్‌లో శనివారం నిర్వహించిన ప్రజా నిరసన సభలో సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడారు. ‘ఆపరేషన్ కగార్’ పేరుతో జరుగుతున్న చర్యలు ప్రజాస్వామ్య విరుద్ధమని ఆరోపించారు. బూటకపు ఎన్‌కౌంటర్ల పేరుతో నిరపరాధుల ప్రాణాలు పోతున్నాయని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య హక్కులపై దాడి – నేతల విమర్శ కె వి పి ఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున మాట్లాడుతూ, ప్రజాస్వామ్య హక్కులను కాపాడాల్సిన ప్రభుత్వాలు దమన చర్యలకు పాల్పడటం సరికాదన్నారు. సీపీఎం పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య మాట్లాడుతూ, దమన విధానాలను తక్షణమే విరమించి ప్రజల సమస్యలపై...