దిత్వా తుఫాన్ ప్రభావం : ప్రజలు అప్రమత్తంగా ఉండాలి– సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ విజ్ఞప్తి
సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్,30 నవంబర్ దిత్వా తుఫాన్ ప్రభావంతో సూర్యాపేట జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కె. నరసింహ సూచించారు. గాలుల తీవ్రత పెరిగే అవకాశం తుఫాన్ ప్రభావంతో చలి గాలుల తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించినట్లు ఎస్పీ తెలిపారు. ముఖ్యంగా బలమైన ఈదురుగాలులు, ఆకస్మిక వర్షపాతంతో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తత పాటించాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. చెట్లు, విద్యుత్ స్తంభాలు, బోర్డులు వంటి...