బీసీల ఆత్మగౌరవం నిలబెట్టేలా కూటమి పాలనదొమ్మరలకు ‘దొర వంశ’గా గౌరవప్రద గుర్తింపు – మంత్రి సవిత
తాడేపల్లి, డైనమిక్ న్యూస్, నవంబర్ 29 రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత ఈరోజు బీసీల ఆత్మగౌరవం నిలబెట్టేలా కూటమి ప్రభుత్వం పాలన సాగుతోందని తెలిపారు. మంత్రి సవిత మాట్లాడుతూ, సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం బీసీల అభ్యున్నతే లక్ష్యంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నదని తెలిపారు. ‘దొర వంశ’ గుర్తింపు దొమ్మర సామాజిక వర్గీయులను గౌరవప్రదంగా ‘దొర వంశ’గా సంభోదించాలంటూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ నిర్ణయం బీసీ కులాల ఆత్మగౌరవాన్ని పెంపొందించే దిశగా తీసుకున్న కీలక అడుగు అని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర పండుగలుగా జయంతులు వాల్మీకి, వడ్డే ఓబన్న, సర్దార్...