త్వరలో సీఎంతో బొట్టుగూడ పాఠశాల నూతన భవన ప్రారంభోత్సవం మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి వెల్లడి
నల్గొండ బ్యూరో , డైనమిక్ న్యూస్, నవంబర్ 29 పూర్వ విద్యార్థుల హర్షం నల్గొండ పట్టణంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన బొట్టుగూడ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నూతన భవన నిర్మాణాన్ని కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టడంపై పాఠశాల పూర్వ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. మంత్రి వెంకటరెడ్డికి ఘన సన్మానం శనివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డిని పూర్వ విద్యార్థులు కలిసి శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు. ఏడు దశాబ్దాల చరిత్ర దాదాపు ఏడు దశాబ్దాల చరిత్ర గల బొట్టుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులు సేవలందించారు....