అమరావతిలో మంత్రి సవితను కలిసిన శ్రీకాకుళం నేతన్నల ప్రతినిధులు చేనేత సమస్యలపై మంత్రి అచ్చెన్నాయుడు వినతి – సీఎం చంద్రబాబు నేతన్నల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నారని భరోసా

అమరావతి, డైనమిక్ న్యూస్, నవంబర్ 26 రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్‌లో బుధవారం రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవితమ్మను శ్రీకాకుళం జిల్లా చేనేత సొసైటీల ప్రతినిధులు, పలువురు నేతన్నలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీకి శ్రీకాకుళం ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నేతృత్వం వహించారు. చేనేతల సమస్యలపై వినతి ఈ సందర్భంగా జిల్లాలోని చేనేత పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి సవిత దృష్టికి మంత్రి అచ్చెన్నాయుడు తీసుకువచ్చారు. ముడిసరుకు కొరత, మార్కెటింగ్ ఇబ్బందులు, కార్మిక సంక్షేమ పథకాల అమల్లోని లోపాలు వంటి అంశాలను వివరంగా వెల్లడించారు. ప్రభుత్వ సహకారంపై భరోసా నేతన్నల ఇబ్బందులను ఓపికగా విన్న మంత్రి సవిత సీఎం...