గ్రామపంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి.జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఆదేశం

సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్,26 నవంబర్ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలను ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అధికారులను ఆదేశించారు.బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా మొదటి విడత నామినేషన్లు స్వీకరించనున్న సూర్యాపేట డివిజన్‌కు చెందిన ఆర్వోలు, స్టేజ్-వన్ ఏఆర్వోలు, ఎంపీడీవోలకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదటి విడతలో 8 మండలాలు – 159 గ్రామపంచాయతీలు మొదటి విడతలో జిల్లాలోని 8 మండలాల్లో కలిపి 159 గ్రామపంచాయతీలు, 1,442 వార్డులకు సంబంధించి 44 నామినేషన్ కేంద్రాల ద్వారా నామినేషన్లు స్వీకరించనున్నట్లు కలెక్టర్ తెలిపారు....