గ్రామపంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాలు

నల్గొండ, నవంబర్ 26 (డైనమిక్ న్యూస్): గ్రామపంచాయతీ ఎన్నికలను ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా, ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు ఆదేశించారు. 14 మండలాల్లో నామినేషన్ల స్వీకరణ బుధవారం ఉదయాదిత్య భవన్‌లో గ్రామపంచాయతీ ఎన్నికల తొలి దశ నామినేషన్ల స్వీకరణకు సంబంధించి నల్గొండ, చండూరు డివిజన్ల ఆర్వోలు (స్టేజ్–వన్), ఏఆర్వోలు, ఎంపీడీవోలు కోసం నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలి విడతలో 14 మండలాల్లోని 117 క్లస్టర్లలో నామినేషన్ల స్వీకరణ జరుగుతుందని తెలిపారు. ఎన్నికల విధుల పట్ల సీరియస్‌గా ఉండాలి గ్రామపంచాయతీ ఎన్నికలను అన్ని స్థాయి అధికారులు అత్యంత సీరియస్‌ గా...