జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడటం ప్రతి పౌరుడి కర్తవ్యం : అడిషనల్ ఎస్పీ రమేష్
నల్గొండ బ్యూరో, డైనమిక్ న్యూస్ నవంబర్ 26, భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. రాజ్యాంగ నిర్మాతలకు ఘన నివాళి వేడుకల సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాతలకు ఘనంగా నివాళులర్పించారు. రాజ్యాంగం అందించిన హక్కులు, బాధ్యతలు, సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ వంటి విలువలను ప్రతి ఒక్కరూ జీవితంలో పాటించాలంటూ అధికారులు ప్రతిజ్ఞ చేశారు. రాజ్యాంగం దేశానికి మార్గదర్శకం : అడిషనల్ ఎస్పీ ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ రమేష్ మాట్లాడుతూ,"భారత రాజ్యాంగం దేశానికి దిక్సూచి. దాని స్ఫూర్తిని ప్రతి పౌరుడు గౌరవించి, కాపాడే...