రాజ్యాంగం పౌరులకు మహావరం : జిల్లా ఎస్పీ నరసింహ రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేసిన జిల్లా పోలీస్ సిబ్బంది
సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్, నవంబర్ 26 రాజ్యాంగం అనేది భారత పౌరులకు లభించిన మహత్తర వరమని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ పేర్కొన్నారు. భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయం ముందు నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి రాజ్యాంగ పీఠికను ఘనంగా పఠించారు. రాజ్యాంగ పరిరక్షణకు ప్రతిజ్ఞ ఈ సందర్భంగా ఎస్పీ నరసింహ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది రాజ్యాంగ విలువలను కాపాడుతూ, చట్ట పాలనకు కట్టుబడి పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగానికి ఉన్న ప్రాధాన్యతను ఈ సందర్భంగా ఎస్పీ వివరించారు. మహానుభావుల త్యాగాల ఫలితం రాజ్యాంగం ఏర్పాటుకు అనేక మంది మహానుభావులు...