హెచ్-1బీ వీసాలపై ట్రంప్ వైఖరికి వైట్‌హౌస్ మద్దతు అమెరికన్ ఉద్యోగాలే లక్ష్యం… విదేశీ నిపుణులపై ‘సమతుల్య’ దృష్టి
వాషింగ్టన్, డైనమిక్ న్యూస్, నవంబర్ 25 హెచ్-1బీ వీసా విధానంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా వైఖరిని వైట్‌హౌస్ ఘనంగా సమర్థించింది. విదేశీ నిపుణులను పూర్తిగా నిరాకరించాలన్న ఉద్దేశ్యంతో కాదు, అమెరికాకు దీర్ఘకాలికంగా లాభం చేకూరే విధంగా ట్రంప్ అభిప్రాయాలు ఉన్నాయని శ్వేతసౌధం స్పష్టం చేసింది. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ మాట్లాడుతూ— “అమెరికాలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టే విదేశీ కంపెనీలు, తమ ప్రత్యేక ఉత్పత్తులకు అవసరమైన నిపుణులను ప్రారంభ దశలో తెచ్చుకోవాల్సి వస్తుంది. ఫ్యాక్టరీలు స్థిరపడే వరకు వారికి అవకాశం ఇవ్వాలన్నదే ట్రంప్ అభిప్రాయం. అయితే ఆ తర్వాత ఆ ఉద్యోగాల్లో అమెరికన్ పౌరులే ఉండాలన్నది ఆయన స్పష్టమైన...