అవసరానికి తగ్గ ఉద్యాన పంటలు వేయండి…ఉద్యానవన డైరెక్టర్ శ్రీనివాసులు…
నరసరావుపేట, డైనమిక్ న్యూస్, నవంబర్ 24 జిల్లా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో సోమవారం మండలం లోని ఉప్పలపాడు గ్రామంలో "రైతన్న మీకోసం" అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా , ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ డైరెక్టర్ డాక్టర్ . కే .శ్రీనివాసులు పాల్గొన్నారు.కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభుత్వం తలపెట్టిన "రైతన్న మీకోసం" కార్యక్రమం జరిగే సరళిని పరిశీలించారు. కార్యక్రమంలో రైతుల యొక్క సర్వే వివరాలను గ్రామ ఉద్యాన సహాయకుల ద్వారా యాప్ లో పొందుపరిచే విధానాన్ని గమనించడం జరిగినది. ఈ సర్వే ద్వారానీటి భద్రత అనగా రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరు అందించే దిశగా డ్రిప్ పరికరాలు రాయితీ ద్వారా...