సాగుకు సాంకేతికత తోడైతే అద్భుతాలు ..!రైతును రోడ్డు పాలు చేసిన ఘనుడు జగన్ రెడ్డి..!వరికపూడిశెల నిర్మించకుంటే రాజకీయ సన్యాసమే..!రైతన్న మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే జూలకంటి..!
.వెల్దుర్తి, డైనమిక్ న్యూస్, నవంబర్ 24 సాగుకు సాంకేతికత తోడైతే అద్భుతాలు సృష్టించవచ్చునని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం మండల పరిధిలోని శిరిగిరిపాడు గ్రామంలో కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతన్నా మీకోసం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా స్థానిక ఆంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై రైతన్నా మీకోసం కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో పర్యటించి, రైతన్న మీకోసం కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, వ్యవసాయంలో తీసుకోవాల్సిన మెలకువలను గురించి రైతులకు వివరిస్తూ.., కరపత్రాలను అందజేశారు. ఈ...