పిజిఆర్ఎస్ అర్జీలను నాణ్యతగా పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి…జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ సూరజ్ …
గుంటూరు, డైనమిక్ న్యూస్, నవంబర్ 24 కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ సూరజ్ అర్జీలను స్వీకరించారు.జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ సూరజ్ తో పాటు అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి మురళి,ఆర్డీఓలు, ఆయా శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి 122అర్జీలను జిల్లా కలెక్టర్ స్వీకరించడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ పిజిఆర్ఎస్ అర్జీలను నాణ్యతగా పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని...