ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి మంత్రి ఉత్తమ్ కృషి ఫలిస్తోంది ఔటర్ రింగ్ రోడ్డు పనులను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు
హుజూర్ నగర్, డైనమిక్ న్యూస్, నవంబర్ 24 హుజూర్ నగర్ పట్టణంలో రవాణా, ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు కీలకమైన ఔటర్ రింగ్ రోడ్డు పనులు దాదాపు పూర్తయిన నేపథ్యంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర మాజీ జాయింట్ సెక్రెటరీ ఎం.డి. అజీజ్ పాషా, మాజీ మున్సిపాలిటీ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర నాయకురాలు చావా కిరణ్మయి పాల్గొన్నారు. 2013లోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి కృషితో ప్రారంభమైన ప్రాజెక్టు నాయకులు మాట్లాడుతూ—హుజూర్ నగర్ పట్టణం వేగంగా అభివృద్ధి చెందు తుండటంతో ట్రాఫిక్ సమస్యలు పెరుగుతాయని ముందుగానే అంచనా వేసిన అప్పుడు గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ ఎన్. ఉత్తమ్...