స్థానిక సంస్థల ఎన్నికల్లో లక్ష్యం గెలుపే — మంత్రి సవిత

పెనుకొండ, డైనమిక్ న్యూస్‌, నవంబర్ 24 స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయమే ప్రధాన ధ్యేయంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని మంత్రి సవితమ్మ పిలుపునిచ్చారు. పెనుకొండ క్యాంపు కార్యాలయంలో సోమవారం నియోజకవర్గ క్లస్టర్, యూనిట్ ఇన్‌చార్జ్‌లతో ఆమె సమావేశం నిర్వహించారు. కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకున్న మంత్రి సమావేశంలో పాల్గొన్న క్లస్టర్, యూనిట్ ఇన్‌చార్జ్‌లతో మంత్రి వ్యక్తిగతంగా మాట్లాడి వారి అభిప్రాయాలు, సూచనలు సేకరించారు. అనంతరం వారికి ఘనసన్మానం కూడా నిర్వహించారు. “పార్టీలో పదవి గౌరవప్రదం” — సవిత ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ,“పార్టీలో పదవి దక్కడం అంటే అది కేవలం బాధ్యత మాత్రమే కాదు, గౌరవప్రదమైన విషయం కూడా. పార్టీ కోసం కష్టపడి...