పెనుకొండ క్యాంపు కార్యాలయంలో మంత్రి సవిత సమీక్ష – వినతుల స్వీకరణ రైతు సమస్యలపై సమగ్ర సమీక్ష – ప్రజలకు భరోసా ఇచ్చిన మంత్రి
పెనుకొండ, డైనమిక్ న్యూస్ నవంబర్ 24 పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి సవిత సోమవారం వరుస కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొదట వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశమై వివిధ రైతు సమస్యలపై సమీక్ష జరిపిన ఆమె, అనంతరం ప్రజల వినతులను స్వీకరించారు. అన్నదాత సుఖీభవ పథకంపై సమీక్ష ఈ సందర్భంగా మంత్రి సవితమ్మ గారు అన్నదాత సుఖీభవ పథకం అమలులో ఎదురవుతున్న సమస్యలపై అధికారులు సమగ్ర సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ప్రస్తుతం రైతుల ఖాతాల్లో సబ్సిడీ రాకపోవడానికి కారణాలుగా ఈ–కెవైసీ పూర్తి కాకపోవడం,బ్యాంకు ఖాతాలకు ఆధార్ లింక్ లోపం,NPCI లింకింగ్ సమస్యలు,ఎక్వీటీ సమయంలో పొలం వివరాల మార్పులు,ఒకే కుటుంబంలో...