స్థానిక సంస్థల ఎన్నికలు ప్రతిష్టాత్మకం— పర్యవేక్షణలో మండల ప్రత్యేక అధికారి కీలక పాత్ర: కలెక్టర్ ఇలాతి త్రిపాఠి
నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్, నవంబర్ 24 నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్థానిక సంస్థల ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని మండల ప్రత్యేక అధికారులు సమగ్రంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ఆమె ఈ సూచనలు చేశారు. ప్రజావాణిలో 70 ఫిర్యాదుల స్వీకరణ ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా ప్రజల నుండి మొత్తం 70 ఫిర్యాదులు స్వీకరించగా, అందులో రెవెన్యూ శాఖకు 31, మిగతా 39 ఫిర్యాదులు జిల్లా విభాగాలకు చేరాయి.ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి, ప్రజావాణి కార్యక్రమానికి నిర్దేశించిన సమయానికి తప్పనిసరిగా హాజరుకావాలని స్పష్టం చేశారు. అన్ని కార్యాలయాలపై ర్యాండమ్...