కేంద్ర మంత్రి పెమ్మసాని ప్రారంభోత్సవం: మేడికొండూరు-గుండ్లపాలెం సీసీ రోడ్లు శంకుస్థాపన

డైనమిక్ న్యూస్,గుంటూరు, నవంబర్ 23 తాడికొండ నియోజకవర్గం మండల కేంద్రం మేడికొండూరు, గుండ్లపాలెం గ్రామాల్లో సీసీ రోడ్లు మరియు ఇతర అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ఆదివారం కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ కూడా పాల్గొన్నారు. రైతులకు గౌరవం: కేంద్ర మంత్రి సందేశం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, కష్టపడే రైతులకు మట్టితో స్నేహం కలిగి ఉంటేనే వ్యవసాయం సుస్థిరంగా ఉంటుందని అన్నారు. గ్రామ అభివృద్ధిలో రాజకీయాలు పక్కన పెట్టి, మంచి నాయకులను గెలిపించుకోవడం కీలకం అని పేర్కొన్నారు. సొంత ఖర్చుతో గ్రామాభివృద్ధికి బాధ్యత తీసుకున్న పాములపాటి కృష్ణయ్య...