పాలకవీడు మండలంలో బీసీ రిజర్వేషన్ లేకపోవడం విచిత్రం కలెక్టర్, ఆర్డీఓ నైతిక బాధ్యత వహించాలి – ధూళిపాళ ధనుంజయ నాయుడు

పాలకీడు, డైనమిక్ న్యూస్, నవంబర్ 23 సూర్యాపేట జిల్లా పాలకవీడు మండల వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్‌లో ఒక్క గ్రామ పంచాయతీ కూడా బీసీలకు కేటాయించక పోవడం ఆశ్చర్యకరమని బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని 22 పంచాయతీల్లో ఒక్క బీసీ రిజర్వేషన్ కూడా లేదు ఆదివారం ప్రకటించిన రిజర్వేషన్లలో పాలకవీడు మండలంలోని మొత్తం 22 గ్రామ పంచాయతీల్లో ఏ ఒక్కటీ బీసీ కేటగిరీకి రాకపోవడం ‘విడ్డూరం మరియు నిర్వాకం’ అని ఆయన వ్యాఖ్యానించారు.“రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు 42% రిజర్వేషన్ కోసం పోరాడుతుంటే, పాలకవీడులో ఒక్క బీసీ పంచాయతీ...