మధ్యవర్తిత్వం న్యాయవ్యవస్థకు బలమైన ఆస్తి: జస్టిస్ కె. లక్ష్మణ్

నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్, నవంబర్ 23 న్యాయవ్యవస్థలో కేసుల భారాన్ని తగ్గించి వేగవంతమైన న్యాయాన్ని అందించడంలో మధ్యవర్తిత్వం (మెడియేషన్) కీలక పాత్ర పోషిస్తోందని తెలంగాణ హైకోర్టు జడ్జ్ జస్టిస్ కె. లక్ష్మణ్ అన్నారు. నల్గొండలో న్యాయవాదుల కోసం ఐదు రోజుల మెడియేషన్ శిక్షణా తరగతుల ప్రారంభం ఆదివారం నల్లగొండ జిల్లా మహాత్మా గాంధీ యూనివర్సిటీలో, జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో, ఉమ్మడి నల్గొండ జిల్లా న్యాయవాదులకు ఉద్దేశించిన ఐదు రోజుల మధ్యవర్తిత్వ శిక్షణా కార్యక్రమాన్ని జస్టిస్ లక్ష్మణ్ ప్రారంభించారు. "కుటుంబ, ఆస్తి, వాణిజ్య కేసులకు మెడియేషన్ ఉత్తమ మార్గం" తరువాత న్యాయవాదులను ఉద్దేశించి మాట్లాడిన జస్టిస్ లక్ష్మణ్ — నేటి సమాజంలో...