నేరేడుచర్ల మున్సిపాల్టీలో అధికార ‘మార్పులేని రాజ్యం’12 ఏళ్లుగా ఒకే పోస్టులో కొనసాగుతున్న మాజీ పంచాయతీ కార్యదర్శి – ప్రస్తుత మున్సిపల్ కమిషనర్‌పై ప్రజల్లో గుసగుసలు
నేరేడుచర్ల, డైనమిక్ న్యూస్, నవంబర్ 23 నేరేడుచర్ల మండల గ్రామ పంచాయతీ నుండి మునిసిపాల్టీ స్థాయికి ఎదిగినప్పటి నుంచి ఒకే వ్యక్తి పదేళ్లకు పైగా ఇక్కడే పదవిలో కొనసాగడం ప్రజల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. అప్పటి పంచాయతీ కార్యదర్శిగా ఉన్న ఈ అధికారి, మునిసిపాల్టీ ఏర్పాటు అయిన తర్వాత కూడా కమిషనర్‌గా పదోన్నతి పొందినా— ట్రాన్స్‌ఫర్ మాత్రం ఒక్కసారైనా జరగకపోవడం స్థానికంగా పెద్ద ప్రశ్నగా మారింది. ఒక్క పోస్టు, ఒకే అధికారి–12 సంవత్సరాల సాగుతున్న అధికారం గ్రామ పంచాయతీ నుంచి మునిసిపాల్టీకి మారిన నేపథ్యంలో సిబ్బంది మార్పులు సహజమని భావించిన నేరేడుచర్ల ప్రజలు, ఎందుకు ఒక్క పోస్టు మాత్రం ఒకే వ్యక్తికి ఎలా కట్టుబడి...