దేశానికి బలమైన స్తంభాలుగా ఎదగాలి విజ్ఞాన్ యూనివర్సిటీలో లీగల్ అవగాహన శిబిరం
డైనమిక్ న్యూస్,గుంటూరు, నవంబర్ 23 సంవిధాన దివాస్ సందర్భంగా ‘కానిస్టిట్యూషన్ వీక్ సెలబ్రేషన్స్–2025’లో భాగంగా వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీ–విజ్ఞాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లా మరియు గుంటూరు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం న్యాయ అవగాహన శిబిరం ఘనంగా నిర్వహించారు. చట్టాలపై అవగాహన ప్రతి పౌరునికీ అవసరం: జడ్జి సాయి కళ్యాణ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గుంటూరు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్–కమ్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ & సెషన్స్ జడ్జ్ బి. సాయి కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ—విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంపొందించుకుంటేనే దేశానికి ‘‘పిల్లర్స్ ఆఫ్ నేషన్’’గా ఎదగగలరని చెప్పారు.చట్టాలు తెలుసుకోవడం ద్వారా హక్కులు–బాధ్యతలు స్పష్టమవుతాయని,న్యాయ సేవలను అందరికీ చేరేలా...