పల్నాడుకు వరుసగా మూడు ఉన్నత పదవులుపుడా–పోలీస్ హౌసింగ్–భట్రాజు కార్పొరేషన్లలో పల్నాడు నాయకుల నియామకం
డైనమిక్ న్యూస్,నరసరావుపేట, నవంబర్ 23 తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు శనివారం ప్రకటించిన 11 రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో మూడు కీలక స్థానాలు పల్నాడు జిల్లాకు కేటాయించారు. టీడీపీ, జనసేన ప్రముఖులకు ఈ పదవులు దక్కడం జిల్లాలో నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం రేపింది. పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (PUDA) చైర్మన్‌గా చిరుమామిళ్ల మధు బాబు మాచర్ల నియోజకవర్గానికి చెందిన సీనియర్ టీడీపీ నాయకుడు చిరుమామిళ్ల మధు బాబు పుడా చైర్మన్‌గా నియమితులయ్యారు.2012లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మధు బాబు — మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు చీఫ్ సెక్యూరిటీ అధికారిగా పనిచేసిన సి.వి. నరసయ్య కుమారుడు. ఉన్నత విద్యావంతుడైన...