సర్పంచ్ కుమారుని వివాహ రిసెప్షన్‌కు ప్రముఖుల హాజరు
అనంతపురం , డైనమిక్ న్యూస్, నవంబర్ 22 అనంతపురం పట్టణంలో సర్పంచ్ పోలేపల్లి చంద్రశేఖర్ కుమారుని వివాహ రిసెప్షన్ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ, సామాజిక ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. మంత్రి కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర మంత్రి సవిత భర్త వెంకటేశ్వర్ రావు ప్రత్యేక అతిథిగా హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వివాహ వేడుకలో పాల్గొనడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. ఉన్నతాధికారులతో పాటు టీడీపీ నేతల హాజరు మాజీ ఐఏఎస్ అధికారి కుంటిమద్ది లక్ష్మీనారాయణ, గోరంట్ల టీడీపీ మండల కన్వీనర్ గుత్తా బాలకృష్ణ చౌదరి తదితరులు కూడా...