ధీరుల సౌరుషాలతో నిండిన పుడమి పల్నాడు..!నవ్య సమాజ స్థాపనే చాపకూడు సిద్దాంతం..!పాఠ్యాంశాల్లో పల్నాడు చరిత్ర పుటాలు ప్రస్పుటించాలి.. సాంప్రదాయంగా సమనత్వం చాటేలా చాపకూడా ఘట్టం..!ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ, ఎమ్మెల్యేలు చదలవాడ, జూలకంటి…
డైనమిక్ న్యూస్.కారంపూడి, నవంబర్ 21 ధీరుల సౌరుషాలతో నిండిన పుడమి పల్నాడు అని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ శాసన సభ్యులు జీవి ఆంజనేయులు ఉద్ఘాటించారు. శుక్రవారం వీరుల మహోత్సవాలను పురస్కరించుకొని మూడవరోజు వీరుల దేవాలయం ప్రాంగణంలో నిర్వహించిన చాపకూడు కార్యక్రమానికి చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు, జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్ల, జిల్లా ఎస్పీ కృష్ణారావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరిని మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి సాదరంగా ఆహ్వానించారు. వీరుల ఆలయంలో ఆనాడు పల్నాటి యుద్ధం వైభవాన్ని ప్రతిబింబించే ఆయుధ సంపదను చూపించి, దగ్గరుండి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కులాలకు,...