చెంచుల సమస్యల పరిష్కారానికి తాండాకే చేరుకున్న కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉదయం 8 గంటలకే అధికార యంత్రాంగంతో నెల్లికల్ చెంచు వాని తండా సందర్శన “మా వద్దకే వచ్చారంటే ఎంతో ఆనందం” అని చెంచుల కృతజ్ఞత
నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్ , నవంబర్ 21 నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం నెల్లికల్ చెంచు వాని తాండా అభివృద్ధి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం ఉదయం 8 గంటలకు శాసనసభ్యులు కుందూరు జయవీర్ రెడ్డితో కలిసి తాండాను సందర్శించారు. తాండాకు వచ్చిన కలెక్టర్‌ను చెంచులు సాంప్రదాయరీతిలో స్వాగతం పలికారు. ప్రజావాణిలో చెంచు మహిళ పిటిషన్‌తో స్పందించిన కలెక్టర్ ప్రతి సోమవారం జరుగుతున్న ప్రజావాణిలో చెంచు వాని తాండాకు చెందిన ఆదెమ్మ తమ తాండాలో ఆధార్ కార్డు, ధ్రువపత్రాల లేమి కారణంగా ఏ పథకం లభించడం లేదని తెలియజేయడంతో ఈ సమస్యపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.చెంచు తాండాకు...