వ్యర్థాల ద్వారా ఆదాయం… మున్సిపాలిటీలకు కలెక్టర్ ఆదేశాలు వ్యర్థాల వేరు–వేరు సేకరణపై స్పష్టమైన దిశానిర్దేశం

సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్, నవంబర్ 21 సూర్యాపేట జిల్లాలో వ్యర్థాల నిర్వహణను శాస్త్రీయ విధానంలో అమలు చేశేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లోని తన ఛాంబర్‌లో శుక్రవారం మున్సిపల్ కమిషనర్లు, ఇంజనీరింగ్ అధికారులు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. తడి–పొడి విడగొట్టి ఆదాయ మార్గాలు సృష్టించాలి మున్సిపాలిటీల్లో సేకరించిన వ్యర్థాలను డంపింగ్‌ యార్డులు లేదా వ్యర్థాల వేరు చేసే కేంద్రాల్లో శాస్త్రీయంగా ప్రాసెస్ చేయాలని కలెక్టర్ సూచించారు.తడి, పొడి, ప్లాస్టిక్, రీసైక్లింగ్ పదార్థాలను విడగొట్టి, మట్టిలో సహజంగా కరుగే వ్యర్థాల ద్వారా కంపోస్ట్...