సిపిఐ శతవార్షికోత్సవ బహిరంగ సభకు లక్షలాదిగా తరలి రావాలి డిసెంబరు 26న ఖమ్మంలో జరుగనున్న చారిత్రక వేడుక రాష్ట్ర నాయకులు బొమ్మగాని ప్రభాకర్, బెజవాడ వెంకటేశ్వర్లు, ధనుంజయ నాయుడు పిలుపు

నేరేడుచర్ల, డైనమిక్ న్యూస్, నవంబర్ 21 భారత కమ్యూనిస్టు పార్టీ స్థాపనకు వందేళ్ళు పూర్తయిన సందర్భంగా డిసెంబరు 26న ఖమ్మంలో నిర్వహించనున్న శతవార్షికోత్సవ బహిరంగ సభకు ప్రజలు లక్షలాదిగా చేరాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్, సూర్యాపేట జిల్లా సిపిఐ కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు పిలుపునిచ్చారు.శుక్రవారం నాడు నేరేడుచర్లలో వివిధ మండలాల సిపిఐ కార్యదర్శులు, ప్రజా సంఘాల బాధ్యులతో సమావేశమైన వారు పార్టీ శతాబ్దపు పోరాట గాథను వివరించారు. సమస్యలున్న ప్రతి చోట సిపిఐ – వందేళ్ల పోరాట చరిత్ర నాయకులు మాట్లాడుతూ—సమస్య...