యువజన-క్రీడల మంత్రిత్వ శాఖ నుంచి NGOలకు ఆర్థిక సహాయం డిసెంబర్ 30లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలి
సూర్యాపేటబ్యూరో, డైనమిక్ న్యూస్,నవంబర్ 21, యువజన అభివృద్ధి, క్రీడల ప్రోత్సాహానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న గ్రాంట్ ఇన్ ఎయిడ్ (NPYAD) పథకం కింద 2025-26 ఆర్థిక సంవత్సరానికి NGOల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా యువజన మరియు క్రీడల అధికారి బి. వెంకట్ రెడ్డి తెలిపారు. దర్పన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి యువజన మరియు క్రీడల మంత్రిత్వ శాఖ, న్యూ ఢిల్లీ ఆధ్వర్యంలో అందించే ఈ ఆర్థిక సహాయం పొందేందుకు సంబంధిత NPOs/NGOs తప్పనిసరిగా దర్పన్ పోర్టల్ (https://ngodarpan.gov.in)లో రిజిస్టర్ అయి ID పొందినవారై ఉండాలని తెలిపారు. కేవలం ఆన్‌లైన్ దరఖాస్తులకే అవకాశం గ్రాంట్ ఇన్ ఎయిడ్ పథకం కింద ఆర్థిక సహాయం కోరే అర్హ...