నేడు రాష్ట్రపతి ముర్ము పర్యటన హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు బేగంపేటకు 1.10 గంటలకు రాష్ట్రపతి రాక

హైదరాబాద్, నవంబర్ 21, డైనమిక్ న్యూస్ తిరుమల పర్యటన ముగించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం మధ్యాహ్నం 1.10 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా ఆమె రాజ్‌భవన్‌కు వెళ్లి మధ్యాహ్న భోజనం అనంతరం విశ్రాంతి తీసుకుంటారు. రాష్ట్రపతి నిలయంలో కళా మహోత్సవ ప్రారంభం రాజ్‌భవన్‌ నుంచి సాయంత్రం 3:50 గంటలకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి రాష్ట్రపతి ముర్ము చేరుకుంటారు. సాయంత్రం 4.00 గంటలకు అక్కడ నిర్వహించే భారతీయ కళా మహోత్సవంను ఆమె ప్రారంభించనున్నారు. అనంతరం సాయంత్రం 6:15 గంటలకు తిరిగి రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. రాజ్‌భవన్‌లో రాత్రి బస రాష్ట్రపతి ముర్ము ఈ రాత్రి తెలంగాణ రాజ్‌భవన్‌లోనే బస చేస్తారు....