స్థానిక సంస్థల ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని
సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్, నవంబర్ 20 రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, అవకతవకలకు తావులేకుండా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో కృషి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని సూచించారు. అన్ని జిల్లాలతో వీడియో కాన్ఫరెన్స్ గురువారం ఆమె హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి సహా పలు ఉన్నతాధికారులతో కలిసి, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అదనపు కలెక్టర్లు, పంచాయతీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణ, ఓటరు జాబితా అభ్యంతరాల పరిష్కారం, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, రిజర్వేషన్ల...