పాము కాటుతో యువతి మృతి – బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం బీఆర్‌ఎస్ నాయకుడు రాపోలు నవీన్ కుమార్ పరామర్శ

నేరేడుచర్ల, డైనమిక్ న్యూస్,నవంబర్20 స్థానిక నేరేడుచర్ల మండల కేంద్రం దిర్శించర్లలోని దుబ్బాలమీద నివసించే వస్తం త్రివేణి ఇటీవల పాము కాటుకు గురై మృతిచెందిన ఘటనపై బీఆర్‌ఎస్ నియోజకవర్గ నాయకుడు రాపోలు నవీన్ కుమార్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. తల్లికి రూ.5,000 ఆర్థిక సహాయం త్రివేణి తల్లిగారు రమణకు రూ.5,000 నగదు సహాయం అందజేస్తూ నవీన్ కుమార్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. చిన్న సహాయం అయినా ఇలాంటి సందర్భాల్లో బాధితులకు ఎంతో తోడ్పడుతుందని పేర్కొన్నారు. గ్రామాల్లో చెత్త పేరుకుపోవడం వల్లే ప్రమాదాలు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ—గ్రామాల్లో సర్పంచ్‌లు లేకపోవడం వల్ల చెత్త సకాలంలో తొలగించకపోవడం, దాంతో పాములు పెచ్చరిల్లి ప్రజలు పాము కాటుకు గురవుతున్నారని...