సాంకేతికతో నేరాల చేదన గుర్తుతెలియని హత్య కేసును ఛేదించిన సూర్యాపేట రూరల్ పోలీసులు

సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్, నవంబర్ 20 సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 15న ఖమ్మం జాతీయ రహదారి పక్కన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం బయటపడిన కేసును సాంకేతిక ఆధారాలతో చేధించి, మొత్తం 9 మంది నిందితులను అరెస్టు చేసినట్టు జిల్లా ఎస్పీ కె. నరసింహ వెల్లడించారు. శవంపై యాసిడ్, ఆనవాళ్లు చెరిపే ప్రయత్నం టేకుమట్ల–ఖమ్మం హైవేపై పిల్లలమర్రి గ్రామ శివారులో సంచిలో కట్టి చిన్న కాలువలో పడేసిన మృతదేహాన్ని రూరల్ పోలీసులు గుర్తించారు. శవంపైన యాసిడ్ పోశి గుర్తుపట్టలేని విధంగా మార్చి వదిలిపెట్టినట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది.క్లూస్ టీమ్ సేకరించిన వేలిముద్రలను డేటాబేస్‌లో పోల్చగా మృతుడు నాగవరపు సత్యనారాయణ @...