నేడు నల్గొండ జిల్లాలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పర్యటన ఆహార ధాన్యాల నిర్వహణలో నూతన దశకు నాంది

నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్, నవంబర్ 20 నల్గొండ జిల్లాలో నేడు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వెలుగులోకి రానున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ఈ పర్యటన జిల్లా వాసుల దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా ఆహార సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన కీలక సదుపాయాల ప్రారంభం, సమీక్ష సమావేశాలు, రైతులతో పరస్పర చర్చలు ఈ పర్యటన ప్రత్యేకతగా నిలవనున్నాయి అని చెప్పవచ్చు ఆహార సంస్థ విభాగ కార్యాలయ నూతన భవనానికి శుభారంభం నల్గొండ పట్టణంలోని ఆహార సంస్థ విభాగ కార్యాలయం ప్రస్తుతం పాత భవనంలోనే కొనసాగుతోంది. ధాన్యాల కొనుగోలు పెరుగుదల, పరిపాలనా విస్తరణ దృష్ట్యా నిర్మించిన కొత్త భవనాన్ని మంత్రి ప్రహ్లాద్...