పదవ తరగతి విద్యార్థులు ప్రతి సబ్జెక్టులో 70% మార్కులు సాధించేలా సిద్ధం కావాలి : కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్, నవంబర్ 19 పదవ తరగతి వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు విద్యార్థులు రోజువారీ చదువుతో పాటు నిరంతర ప్రాక్టీస్ చేసి, ప్రతి సబ్జెక్టులో కనీసం 70 శాతం మార్కులు తెచ్చేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు.మంగళవారం పెన్‌పహాడ్ మండలం అనంతారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్, పదవ తరగతి విద్యార్థులతో తెలుగు, ఇంగ్లిష్ పాఠాలను చదివించడంతో పాటు నోట్‌బుక్స్‌ను పరిశీలించారు. చదువు ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించిన కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడిన ఆయన, “పదవ తరగతి జీవితంలో తొలి మెట్టు. మంచి మార్కులు సాధిస్తే ఇంటర్‌లో కోరుకున్న కళాశాలలో...