సూర్యాపేటలో అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం వేడుకలు తల్లిదండ్రుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత : కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్, నవంబర్ 19 సూర్యాపేటలో అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. వయో వృద్ధుల కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు కలెక్టర్ మాట్లాడుతూ, వయో వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం రూపొందించిన చట్టాలు, పథకాలు జిల్లాలో సమర్థంగా అమలవుతున్నాయని తెలిపారు. పెద్దలను సంరక్షించడం ప్రతి కుటుంబ సభ్యుడి నైతిక బాధ్యత అని పేర్కొన్నారు. సైబర్ మోసాలపై సీనియర్ సిటిజెన్స్ అప్రమత్తంగా ఉండాలి పెన్షన్ అకౌంట్లను లక్ష్యంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు...