ఇందిర మహిళా శక్తి చీరల పంపిణీని విజయవంతం చేయాలి : సూర్యాపేట కలెక్టర్

సూర్యాపేటబ్యూరో, నవంబర్ 19 డైనమిక్ న్యూస్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో “ఇందిర మహిళా శక్తి చీరల పంపిణీ” కార్యక్రమాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమన్వయంతో విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రస్థాయి వీడియో కాన్ఫరెన్స్ బుధవారం ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నేతృత్వంలో, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, సహాచర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పాల్గొన్న వీడియో కాన్ఫరెన్స్‌లో చీరల పంపిణీపై సూచనలు జారీ అయ్యాయి. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. మహిళల ఆర్థిక శక్తీకరణకు ప్రభుత్వం విస్తృత చర్యలు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ— మహిళల ఆర్థిక ఉన్నతికి ప్రభుత్వం...